రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్య, ఇంటర్మీడియట్ బోర్డు కార్యకలాపాలను ఇకపై ‘జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి’ (డీ ఐఈవో) పర్యవేక్షించనున్నారు.
నేటి అర్ధరాత్రి తరువాత పోస్టింగ్ ఆర్డర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్య, ఇంటర్మీడియట్ బోర్డు కార్యకలాపాలను ఇకపై ‘జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి’ (డీ ఐఈవో) పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యా శాఖ కొత్తగా 31 జిల్లాలకు డీఐఈవోల పేర్లను ఖరారు చేసింది. జిల్లాల వారీగా కేటాయించిన అధికారులకు సోమవారం అర్ధరాత్రి తరువాత పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీంతో వారం తా మంగళవారం నుంచి వారికి కేటాయించిన జిల్లా ల్లో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జిల్లాల్లో ఇంటర్మీడియెట్ విద్యా శాఖ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డీవీఈవో), ఇంటర్మీడియెట్ బోర్డు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న రీజనల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ (ఆర్‌ఐవో) పోస్టులను రద్దు చేసింది. ఆ 2 విభాగాల సమగ్ర కార్యకలాపాలను ఇకపై డీఐఈవో నే పర్యవేక్షిస్తారు. ఇప్పటివరకు డీవీఈవోలు ఏడుగురిని రెగ్యులర్‌గా పాత జిల్లాల్లో (రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజిగిరి, వికారాబాద్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ) నియమించారు. మిగతా జిల్లాల్లో సీనియర్ ప్రిన్సిపాళ్లకు ఇన్‌చార్జి డీఐఈవోలుగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
జిల్లాల వారీగా నియమితులైన డీఐఈవోలు
ఆదిలాబాద్: నాగేందర్, నిర్మల్: ఎండీ ఖాలీఖ్, మంచిర్యాల: ప్రభాకర్‌రెడ్డి, ఆసిఫాబాద్: గోపాల్, కరీంనగర్: సుహాసిని, జగిత్యాల: మనోహర్, సిరిసిల్ల: రామచంద్రం, పెద్దపల్లి: బీనారాణి, వరంగల్: కె.కాశీనాథ్, వరంగల్ రూరల్: ఆర్.సీహెచ్.ఆజాద్, మహబూబాబాద్: శంకర్, జనగాం: ఇంద్రాణి, భూపాలపల్లి: షేక్ అహ్మద్, ఖమ్మం: రవి బాబు, భద్రాద్రి: సావిత్రి, నల్లగొండ: ఆండ్రూవ్స్, సూర్యాపేట: ప్రకాశ్ బాబు, యాదాద్రి: భాస్కర్, నిజామాబాద్: ఒడ్డెన్న, కామారెడ్డి: నాగరాజు, మహబూబ్‌నగర్: సుధారాణి, నాగర్‌కర్నూల్: కృష్ణాగౌడ్, వనపర్తి: ఎం.సుధాకర్, గద్వాల: ఎస్‌కే బసంత్‌రాజ్, మెదక్: నర్సింహులు, సిద్దిపేట్: ఎన్.నాగముని, సంగారెడ్డి: ఎం.కిషన్, హైదరాబాద్: ప్రభాకర్, శంషాబాద్: మహబూద్‌అలీ, మేడ్చెల్ (మల్కాజిగిరి): హనుమంతారావు, వికారాబాద్: శంకర్‌నాయక్.