మూసీ కాలువలో పడి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన సంఘటన నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది.
మూసీ కాలువలో పడి ఓ వ్యక్తి కొట్టుకుపోయిన సంఘటన నగరంలోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మల్లేష్(40) మూత్ర విసర్జన కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.