నితిన్కు పవన్ ప్రత్యేక కానుక | pawankalyan sends mangoes to nithin | Sakshi
Sakshi News home page

నితిన్కు పవన్ ప్రత్యేక కానుక

May 30 2016 6:29 PM | Updated on Mar 22 2019 5:33 PM

నితిన్కు పవన్ ప్రత్యేక కానుక - Sakshi

నితిన్కు పవన్ ప్రత్యేక కానుక

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్కు మరోసారి ప్రత్యేక కానుక అందింది

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి యువ హీరో నితిన్కు మరోసారి ప్రత్యేక కానుక అందింది. పవన్ తన మామిడి తోటలో పండించిన తాజా మామిడి పండ్లను నితిన్కు పంపారు. వీటిని ఓ పెట్టెలో పార్శిల్ చేసి పంపించారు. త్వరలో విడుదల కానున్న నితిన్ సినిమా 'అ ఆ' విజయవంతం కావాలని కోరుతూ పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ పంపిన మామిడి పండ్ల బుట్టను నితిన్ ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు.

ప్రతి ఏడాదీ వేసవిలో పవన్ కల్యాణ్ కొంతమందికి మామిడిపళ్లను పంపిస్తుంటాడు. పవన్ కల్యాణ్‌కి హైదరబాద్ శివార్లలో మామిడి తోట ఉంది. అందులో పండిన తాజా మామిడి పళ్లను ఆప్తులకు పంపిస్తుంటారు. ఇలా ప్రతి ఏడాదీ ఈ పళ్లు అందుకుంటున్నవారిలో నితిన్ కూడా ఉన్నాడు. గత రెండు వేసవుల్లో కూడా పవన్.. నితిన్కు మామిడి పళ్లను పంపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement