‘టీఎస్‌కాప్‌’లోకి పాస్‌పోర్టు వెరిఫికేషన్‌

అందుబాటులోకి తేవాలని పోలీస్‌ శాఖ ప్రయత్నాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖ చేతుల్లోకి త్వరలో రాబోతున్న ‘టీఎస్‌ కాప్‌’యాప్‌లోకి మరో సర్వీసు చేరబోతోంది. ప్రస్తుతం 54 సర్వీసులతో రూపొందించిన ఆ శాఖ పాస్‌పోర్టు పరిశీలననూ దీనిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ ప్రక్రియను కేవలం 2 లేదా 3 రోజుల్లో పూర్తిచేస్తున్నారు. దీంతో వారంలోపే అభ్యర్థులు పాస్‌పోర్టు పొందుతున్నారు.

నగర కమిషనర్‌గా పనిచేసిన మహేందర్‌రెడ్డి మూడేళ్ల క్రితం పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో త్వరితగతిన పరిశీలన పూర్తిచేయడంతో పాటు సిబ్బంది పనితీరుపై ఫీడ్‌బ్యాక్‌ను సైతం దరఖాస్తుదారుల నుంచి స్వీకరించారు. అయితే ఆ సాఫ్ట్‌వేర్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో యాప్‌ పరిధిలోకే వెరిఫికేషన్‌ను తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పాస్‌పోర్టు దరఖాస్తుదారుల వెరిఫికేషన్‌ 3 రోజుల్లో పూర్తవుతుంది. యాప్‌లో ఉన్న డేటాబేస్‌తో దరఖాస్తుదారులపై కేసులు, ఇతర వివరాలనూ క్షణాల్లో తెలుసుకోవచ్చు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top