'రోహిత్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు' | MP varaprasad to solidarity for HCU students over Hunger strike | Sakshi
Sakshi News home page

'రోహిత్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు'

Jan 27 2016 5:09 PM | Updated on Sep 3 2017 4:25 PM

సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆమరణ దీక్షకు తిరుపతి ఎంపీ వరప్రసాద్ సంఘీభావం తెలిపారు.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థుల ఆమరణ దీక్షకు తిరుపతి ఎంపీ వరప్రసాద్ సంఘీభావం తెలిపారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోహిత్‌ మరణం అతని కుటుంబానికి తీరని లోటని అన్నారు. రోహిత్‌ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, హెచ్‌సీయూలో సస్పెన్షన్కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్‌డీ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రీసెర్చ్ స్కాలర్ రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడుగురు విద్యార్థులు కొన్నిరోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement