కూలి పని కోసం వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
సైదాబాద్(హైదరాబాద్ సిటీ): కూలి పని కోసం వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఐఎస్‌సదన్ డివిజన్ నీలం రాజశేఖర్‌రెడ్డినగర్‌కు చెందిన ఎన్. రేణుక(41) ఈ నెల 7న కూలీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త హరినాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేస్తున్నారు.