ఉపవాస దీక్షతో మృతిచెందిన ఆరాధన కేసు వ్యవహారంపై గురువారం లోకయుక్తలో ఫిర్యాదు నమోదైంది.
హైదరాబాద్: ఉపవాస దీక్షతో మృతిచెందిన ఆరాధన కేసు వ్యవహారంపై గురువారం లోకయుక్తలో ఫిర్యాదు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యాపారికి ఇటీవలి కాలంలో తరచూ నష్టాలు వస్తుండటంతో.. కుటుంబ సభ్యుల బలవంతంతో ఆయన పదమూడేళ్ల కూతురు ఆరాధన 68 రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి డీహైడ్రేషన్‌కు గురై ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ అంశంలో జోక్యం చేసుకున్న బాలల హక్కుల సంఘం లోకయుక్తలో ఫిర్యాదు చేసింది. ఆరాధన మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ వ్యవహారంపై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఈ నెల 24 లోపు సమగ్ర నివేదికం అందించాలని నార్త్‌జోన్ డీసీపీకి లోకయుక్త ఆదేశాలు జారీ చేసింది.