షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే: బాలకృష్ణ | Lepakshi Utsav conducts on february 27 and 28, says balakrishna | Sakshi
Sakshi News home page

షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే: బాలకృష్ణ

Nov 13 2015 7:33 PM | Updated on Oct 9 2018 5:03 PM

షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే: బాలకృష్ణ - Sakshi

షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే: బాలకృష్ణ

సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే తిరుపతిలో జరిగిన సమావేశానికి హాజరు కాలేకపోయానని సినీ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.

హైదరాబాద్: సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్లే తిరుపతిలో జరిగిన దిశానిర్దేశక సదస్సుకు హాజరు కాలేకపోయినట్లు సినీ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో శుక్రవారం సాయంత్రం బాలకృష్ణ భేటీ అయ్యారు. ఏపీ సచివాలయంలో లేపాక్షి ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.

అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ లేపాక్షి ఉత్సవాలకు కేంద్రమంత్రులను, సీఎంలను ఆహ్వానిస్తామన్నారు. తొలుత డిసెంబర్ 27, 28 తేదీల్లో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించాలని గతంలో ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం చేపడతామని బాలకృష్ణ  వెల్లడించారు. అనంతపురం జిల్లా హిందుపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా  ప్రభుత్వం ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement