రాజకీయం కోసం కోర్టులను వాడుకుంటారా? | Karne Prabhakar comments on congress | Sakshi
Sakshi News home page

రాజకీయం కోసం కోర్టులను వాడుకుంటారా?

Nov 3 2016 1:22 AM | Updated on Mar 18 2019 7:55 PM

రాజకీయం కోసం కోర్టులను వాడుకుంటారా? - Sakshi

రాజకీయం కోసం కోర్టులను వాడుకుంటారా?

తమ రాజకీయాల కోసం కోర్టులను కూడా వాడుకుంటున్న నీచమైన సంస్కృతి కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు.

కాంగ్రెస్‌పై కర్నె ప్రభాకర్ మండిపాటు

 సాక్షి, హైదరాబాద్: తమ రాజకీయాల కోసం కోర్టులను కూడా వాడుకుంటున్న నీచమైన సంస్కృతి కాంగ్రెస్‌దేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. నాలుగు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ నేతలకు ప్రజల సమస్యలు ఏనాడూ పట్టలేదని విమర్శించారు. బుధవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, తమ హయాంలో కాంగ్రెస్ పాలకులు తెలంగాణ ప్రజల సమస్యలు తమవి కావన్న రీతిలో వారు వ్యవహరించే వారని పేర్కొన్నారు.

మల్లన్న సాగర్ వ్యవహారంలో 2014లోనే చనిపోయిన ఓ రైతు పేరిట కాంగ్రెస్ నేతలు కోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ఇలా తప్పుడు పిటిషన్ వేసిన వారిపై కోర్టు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ పట్ల డెంగీ దోమలుగా తయారయ్యారని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూడలేక అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని సర్వేలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వస్తున్న విషయం కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని కర్నె ప్రభాకర్ నిలదీశారు.   

Advertisement
 
Advertisement
Advertisement