వైఎస్సార్‌సీపీలో పదవులకు జ్యోతుల రాజీనామా | Jyotula resignation of positions in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పదవులకు జ్యోతుల రాజీనామా

Mar 30 2016 2:05 AM | Updated on Jul 25 2018 4:07 PM

వైఎస్సార్‌సీపీలో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెలే జ్యోతుల నెహ్రూ మంగళవారం ప్రకటించారు.

పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు లేఖ

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీలో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెలే జ్యోతుల నెహ్రూ మంగళవారం ప్రకటించారు. పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్ ద్వారా పంపారు.

 లేఖ వివరాలిలా ఉన్నాయి...
 గౌరవ శ్రీయుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి నమస్కరించి సమర్పించు రాజీనామా పత్రం.

 ఆర్యా!
 పార్టీలో మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయలేని కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మీరు నాకు అప్పగించిన అన్ని బాధ్యతల నుంచి అనగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు తదితర పదవుల నుంచి తప్పుకొనుచున్నాను. కావున ఆమోదించాల్సిందిగా కోరుచున్నాను.
                                                                                                              ధన్యవాదములతో....
                                                                                                              భవ దీయుడు
                                                                                                              జ్యోతుల నెహ్రూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement