రాష్ట్రంలో మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్-2016 పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
మార్చి 2 నుంచి 21 వరకు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్చి 2 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్-2016 పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,363 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 9,93,891 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు 2వతేదీ నుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 3 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 21తో పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ తెలిపారు.
117 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించగా, వాటిలో సున్నిత 35 కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇతర కాలేజీలకు నిర్ణీత పరిధికన్నా దూరంగా ఉన్న 55 కేంద్రాలను సెల్ఫ్ పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటుచేశారు.పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విజయవాడ నాగార్జున నగర్లో, హైదరాబాద్ ఇంటర్‌బోర్డులో కంట్రోల్ రూములు ఏర్పాటుచేశారు. కంట్రోల్‌రూమ్ ఫోన్ నంబర్లు విజయవాడలో 0866-2974130, హైదరాబాద్‌లో 040-24603317, 040-24603318.