హైకోర్టులో ఈ - కోర్టు ప్రారంభం | e -court inagurates in high court | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఈ - కోర్టు ప్రారంభం

Jul 17 2016 10:51 AM | Updated on Aug 31 2018 8:31 PM

హైదరాబాద్లోని హైకోర్టులో ఈ - కోర్టు ఆదివారం ప్రారంభమైంది. ఈ - కోర్టును సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు.

హైదరాబాద్ : హైదరాబాద్లోని హైకోర్టులో ఈ - కోర్టు ఆదివారం ప్రారంభమైంది. ఈ - కోర్టును సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. దాంతో దేశంలోనే మొట్టమొదటిగా పేపర్ లెస్ ఈ - కోర్టు ప్రారంభమైంది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే చొరవతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చిన హైకోర్టు ఇప్పడు మరో ముందడుగు వేసినట్లు అయింది. కేసుల జాబితా, తీర్పులు, కేసుల స్థితిగతులు తదితరాలన్నీ ఇప్పటికే వెబ్ సైట్లో మొబైల్ అప్లికేషన్ల ద్వారా అందుబాటులో ఉంచి హైకోర్టు తాజాగా కాగితరహిత ఈ - కోర్టును ఏర్పటు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement