ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు.
హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. కూంబింగ్ లో ఉన్న పోలీసులకు మంగళవారం ఉదయం 7.30గంటలకు మావోయిస్టులు తారసపడ్డారని, ఆత్మరక్షణలో భాగంగా ఎదురు కాల్పులు జరిపారని అనురాగ్ శర్మ తెలిపారు. పోలీసుల కాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారని, మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. అయితే మృతులు ఎవరనేది ఇంకా గుర్తించలేదన్నారు.
మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గత నాలుగు రోజులుగా కూంబింగ్ జరుపుతున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఏకే 47, ఎస్ఎల్ఆర్, మూడు 303 రైఫిల్స్, 2 ఎస్బీపీఎల్ ఆయుధాలను మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అనురాగ్ శర్మ తెలిపారు.