అన్నా...పార్టీని నాశనం చేస్తున్నారు..! | destroy the party | Sakshi
Sakshi News home page

అన్నా...పార్టీని నాశనం చేస్తున్నారు..!

Jan 21 2016 12:34 AM | Updated on Aug 10 2018 8:16 PM

అన్నా...పార్టీని నాశనం చేస్తున్నారు..! - Sakshi

అన్నా...పార్టీని నాశనం చేస్తున్నారు..!

కొందరు నాయకులు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, వారిపై తగుచర్యలు తీసుకోవడంతోపాటు నిజమైన కార్యకర్తలు....

కొనసాగుతున్న నైషధం నిరసన
 
సిటీబ్యూరో: కొందరు నాయకులు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, వారిపై తగుచర్యలు తీసుకోవడంతోపాటు నిజమైన కార్యకర్తలు, నాయకులకు తగిన న్యాయం చేయాలని కోరు తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణమూర్తి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి మరో లేఖ రాశారు.  బుధవారం ఆ లేఖను ఎన్టీఆర్ విగ్రహాని కి అందజేసి వినూత్నంగా నిరసన తెల పారు. కార్పొరేటర్ టిక్కెట్ దక్కకపోవడంతో మస్థాపానికి లోనైన నైషధం గత మూడు రోజులుగా వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు.

టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరో ఇద్దరితో కలిసి టిక్కెట్లు అమ్ముకున్నారని, విచారణ జరిపిస్తే సాక్ష్యాధారాలను అందజేస్తానని తాజా లేఖలో పేర్కొన్నారు.  చంద్రబాబు అందుబాటులో లేనందున స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి లేఖను అందజేస్తున్నానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూని యర్ ఎన్టీఆర్‌కు టీ-టీడీపీ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ అప్రదిష్టపాలవుతుందని హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement