'గే'ల మధ్య గొడవ, యువకుడి మృతి | conflict between gays, one died | Sakshi
Sakshi News home page

'గే'ల మధ్య గొడవ, యువకుడి మృతి

Oct 14 2014 11:51 AM | Updated on Sep 2 2017 2:50 PM

హైదరాబాద్ నారాయణగూడలో ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య (గే) మంగళవారం వాగ్వివాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్ : హైదరాబాద్ నారాయణగూడలో ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య (గే) వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్తా శ్రుతిమించటంతో ఓ వ్యక్తిని మరో వ్యక్తి భవనం పైనుంచి తోసేశాడు. ఈ ఘటనలో అతను మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. నర్సింహ అనే రిటైర్డ్ ఉద్యోగి ఆబిడ్స్ నుంచి ఓ యువకుడిని తీసుకుని నారాయణగూడ ప్రాంతానికి సోమవారం అర్ధరాత్రి సమయంలో వచ్చాడు. అక్కడ ఏంజరిగిందో తెలియదు గానీ, ఇద్దరి మధ్య గొడవ మొదలై, అది ముదిరింది. కాసేపటి తర్వాత నర్సింహ తనతో పాటు వచ్చిన యువకుడిని మేడపైనుంచి కిందకు తోసేశాడు. దాంతో అతడు మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement