'అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు' | cine producer natti kumar speaks over minister acham naidu, nayeem relationship | Sakshi
Sakshi News home page

'అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు'

Aug 24 2016 4:30 PM | Updated on Aug 29 2018 7:50 PM

'అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు' - Sakshi

'అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారు'

మంత్రి అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారని నట్టికుమార్ ఆరోపించారు.

హైదరాబాద్: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తనను ఎప్పుడూ చూడలేదని, అబద్ధాలాడుతున్నారని నట్టికుమార్ ఆరోపించారు. మంత్రిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. హైదరాబాద్లో బుధవారం నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ...గ్యాంగ్స్టర్ నయీం, మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపితే అన్ని వాస్తవాలు బయటకొస్తాయని చెప్పారు.

మే 17న స్పైస్ జెట్ విమానంలో తామిద్దరం విశాఖ నుంచి హైదరాబాద్కు వచ్చామన్నారు. విమాన ప్రయాణ సమయంలో నయీంకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రితో మాట్లాడానన్నారు. సీసీ టీవీ ఫుటేజీ బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు.

టీడీపీ నేత జగ్గిరెడ్డికి ఉత్తరాంధ్రలో నాలుగే క్యాంటీన్లు ఉన్నాయని చెబుతున్నారని...అంతకంటే ఎక్కువ క్యాంటీన్లు ఉంటే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు చైతన్యరెడ్డిపైనా కూడా విచారణ జరపాలని నట్టికుమార్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement