
ఆ వ్యాఖ్య ఆయన అపరిపక్వతకు నిదర్శనం
నిజాం ఇచ్చిన తుపాకులతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు...
బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విమర్శ
సాక్షి, హైదరాబాద్: నిజాం ఇచ్చిన తుపాకులతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. వీరోచిత సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి కమ్యూనిస్టులను దేశ ద్రోహులు అనడం హాస్యాస్పదమని బుధవారం పేర్కొన్నారు. ఆనాటి స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేని విషయాన్ని ఆ పార్టీ నేతలు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు ఏకంగా ఆరెస్సెస్‌ను నిషేధించిన నాటి హోంమంత్రి సర్దార్ పటేల్‌ను నిస్సిగ్గుగా పొగడటం వారి రాజకీయ దివాళాకోరుతనానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు. ఇంద్రసేనారెడ్డి కమ్యూనిస్టుల గురించి మాట్లాడే ముందు నాటి స్వాతంత్య్ర సమరయోధుల పాఠాలు నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు.