కేంద్రమే షబ్బీర్ అలీకి భద్రత కల్పించాలి: దిగ్విజయ్ | cetral should protect shabbir ali: digvijay singh | Sakshi
Sakshi News home page

కేంద్రమే షబ్బీర్ అలీకి భద్రత కల్పించాలి: దిగ్విజయ్

Dec 12 2015 3:40 PM | Updated on Aug 14 2018 3:55 PM

కేంద్రమే షబ్బీర్ అలీకి భద్రత కల్పించాలి: దిగ్విజయ్ - Sakshi

కేంద్రమే షబ్బీర్ అలీకి భద్రత కల్పించాలి: దిగ్విజయ్

కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ లేఖ రాశారు.

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ లేఖ రాశారు. 'తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీని చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదు. కేంద్రమే షబ్బీర్ అలీకి భద్రత కల్పించాలి' అని దిగ్విజయ్ సింగ్, రాజ్నాథ్‌సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపుతామని షబ్బీర్ అలీని శుక్రవారం బెదిరించిన విషయం తెలిసిందే. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే తనను చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని చెప్పారు. దీనిపై షబ్బీర్ అలీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపుకు పాల్పడ్డ వ్యక్తి వివరాలను కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement