రేవంత్ అనుచిత వ్యాఖ్యలు : కేసు నమోదు | case filed on tdp mla revanth reddy over Inappropriate Comments on cm kcr | Sakshi
Sakshi News home page

రేవంత్ అనుచిత వ్యాఖ్యలు : కేసు నమోదు

Jun 26 2016 10:05 AM | Updated on Aug 10 2018 7:19 PM

రేవంత్ అనుచిత వ్యాఖ్యలు : కేసు నమోదు - Sakshi

రేవంత్ అనుచిత వ్యాఖ్యలు : కేసు నమోదు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

హైదరాబాద్: ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి.. దీక్ష తొలిరోజే ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో మన్నె గోవర్ధన్ రెడ్డి అనే టీఆర్‌ఎస్ నేత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రేవంత్‌రెడ్డిపై 504, 290, 188, 21/76 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement