
బ్యాంబూ చికెన్ అదుర్స్...
హార్టీకల్చర్ షోలో ఏర్పాటుచేసిన ఫుడ్‌కోర్టులు సాయంత్రం వేళ కిటకిటలాడుతున్నాయి.
ఖైరతాబాద్: హార్టీకల్చర్ షోలో ఏర్పాటుచేసిన ఫుడ్‌కోర్టులు సాయంత్రం వేళ కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ‘బ్యాంబూ చికెన్’కు క్రేజ్ బాగా పెరిగింది. ప్రత్యేకంగా ఖమ్మం నుంచి తీసుకువచ్చిన వెదురు బొంగులను కట్‌చేసి, వాటిలో చికెన్ నింపి ఉడికించి ప్రత్యేకంగా తయారుచేస్తున్న ఈ వంటకాన్ని తినేందుకు జనం ఎగబడుతున్నారు. ఆయిల్ లేకుండా ఉప్పు, కారం, మసాలాలు కలిపి ఉడికించే ఈ చికెన్‌ను ప్లేట్ 80 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు స్టాల్ నిర్వాహకుడు మల్లేష్ తెలిపారు.