ఓ క్రిమినల్ కేసులో ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూకి చెందిన ప్రతినిధులకు హైకోర్టులో ఊరట లభించింది.
సాక్షి, హైదరాబాద్: ఓ క్రిమినల్ కేసులో ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూకి చెందిన ప్రతినిధులకు హైకోర్టులో ఊరట లభించింది. బీఎండబ్ల్యూ ఇండియా లిమిటెడ్ మాజీ ఫైనాన్స్ డెరైక్టర్ సంజీవ్ షా, ప్రస్తుత మార్కెటింగ్ అధిపతి విక్రాంత్ సింగ్ లొంగిపోయిన తరువాత వారికి బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు గురువారం కింది కోర్టును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బలుసు శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. బీఎండబ్ల్యూ తనను మోసం చేసిందంటూ హైదరాబాద్‌కు చెందిన కార్ల డీలర్ వీరేన్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమలగిరి పోలీసులు బీఎండబ్ల్యూ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. సంజీవ్ షా, విక్రాంత్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పు వెలువరించారు.