ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అధికారి | ACB entrapped GHMC officer | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ అధికారి

Jul 2 2016 9:13 PM | Updated on Aug 17 2018 12:56 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులకు చిక్కాడు.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)అధికారులకు చిక్కాడు.    జీహెచ్‌ఎంసీ సర్కిల్-18 గణాంకశాఖ అధికారి నిత్యానంద  శనివారం సాయంత్రం  లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రెజిమెంటల్ బజార్‌కు చెందిన ఉమాదేవి తన ఇంటి మ్యుటేషన్ కోసం రూ.2,000 లంచం ఇస్తుండగా ఆయన దొరికిపోయారు. ప్రస్తుతంఆయన కార్యాలయంతోపాటు బోయిన్‌పల్లిలోని ఇంట్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement