సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 120 కిలోల గంజాయి పట్టివేత | 120 kg marijuana captured in Secunderabad Railway Station | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 120 కిలోల గంజాయి పట్టివేత

Aug 22 2017 1:51 AM | Updated on Sep 12 2017 12:41 AM

రైళ్లలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను జీఆర్‌పీ బృందం క్రమంగా అడ్డుకట్ట వేస్తోంది.

హైదరాబాద్‌: రైళ్లలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాను జీఆర్‌పీ బృందం క్రమంగా అడ్డుకట్ట వేస్తోంది. ఈ నెల 12న ఒక క్వింటాలు గంజా యిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్‌కు తరలించిన రైల్వే పోలీసులు సోమవారం 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని మరో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.చంద్రయ్య, ఎస్‌ఐలు బి.ప్రమోద్‌కుమార్, నాగే«శ్వర్‌రెడ్డి, వీరలింగం నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన లోకమాన్యతిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో తనిఖీలు నిర్వహించింది.

జనరల్‌ బోగీలో అనుమానాస్పదంగా లగేజీ బ్యాగులు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారివద్ద 120 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి ముంబైకి రవాణా చేస్తున్నట్లు నిందితులు బసుదేబ్‌(40), సంజయ్‌ కుమా ర్‌(21), గౌరవ్‌ చంచన్‌(40) పోలీసుల విచారణలో అంగీకరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement