మర్రి లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ | ys-sharmila-paramarsha-yatra third day-in-warangal district | Sakshi
Sakshi News home page

మర్రి లక్ష్మి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

Aug 26 2015 10:36 AM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గం నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా షర్మిల బుధవారం ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ముందుగా నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పీచరలోని ఎడపెల్లి వెంకటయ్య కుటుంబాన్నిషర్మిల పరామర్శించారు. అనంతరం ఇదే మండలం మల్లికుదురులోని మర్రి లక్ష్మీ ఇంటికి వెళ్లి వారికి భరోసా ఇచ్చారు.

అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గంలోని మడికొండలో మద్దెల గట్టయ్య, దోమ లింగయ్య, బస్కుల సుధాకర్ కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తర్వాత వర్ధన్నపేట మండలం సింగారంలోని కాకర్ల రాజయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. చివరగా మామూనూరులోని ఎర్ర భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. మూడో రోజు ఏడు కుటుంబాలను పరామర్శించే క్రమంలో 82.5 కిలో మీటర్ల దూరం మేరకు యాత్ర సాగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement