వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా లో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది.
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా లో చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా బుధవారం ఐదు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మొదటగా నెక్కొంట మండలం మండలం వెంకటాపురంలోని కూరం ఐలయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం దీక్షకుంట చేరుకుని అక్కడ బేతం చంద్రయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.
అనంతరం కొమ్ముల మల్లమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి చెన్నారావు పేట మండలం జీజీఆర్ పల్లికి చేరుకుని బూస నర్సయ్య కుటుంబానికి భరోసా కల్పిస్తారు. మూడో రోజు యాత్రలో చివరగా ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలం ఓటాయితండలోని బానోత్ మంగళి కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు.