శ్రీమఠంలో ప్రముఖులు | vijaya malya visits sree matam in mantralayam | Sakshi
Sakshi News home page

శ్రీమఠంలో ప్రముఖులు

Oct 23 2015 2:22 PM | Updated on Apr 6 2019 9:07 PM

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.

మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు. కింగ్ ఫిషర్ అధినేత విజయమాల్యా, తమిళనాడు పశుసంవర్థక శాఖా మంత్రి చిన్నయ్య కుటుంబసభ్యులతో కలిసి శ్రీమఠాన్ని దర్శించుకున్నారు. మందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనంను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారి మెమెంటో ఇచ్చి సత్కరించారు. ఇదే సమయంలో మఠానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement