'విశ్వనగరానికి నిర్దిష్ట ప్రణాళిక ఏదీ?' | " There is no specific plan for Viswanagaram? ' | Sakshi
Sakshi News home page

'విశ్వనగరానికి నిర్దిష్ట ప్రణాళిక ఏదీ?'

Mar 14 2016 5:41 PM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రశేఖర్‌రావు బడ్జెట్‌లో సరియైన కేటాయింపులు చేయలేదని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.

- బడ్జెట్ పై పెదవి విరిచిన టీడీపీ నేత ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రశేఖర్‌రావు బడ్జెట్‌లో సరియైన కేటాయింపులు చేయలేదని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణ బడ్జెట్‌పై సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిర్మిస్తామని చెప్పడం కేవలం కమిషన్ల కోసమేనని ఆరోపించారు.

బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా ఇళ్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. 125గజాల స్థలాల్లోనే డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. అపార్టుమెంట్లు నిర్మించడం వల్ల డ్రైనేజీ, మంచినీటి, సామాజిక సమస్యలు వస్తాయని అభిప్రాయపడ్డారు. మెట్రోరైల్‌ను శివారు ప్రాంతాలకు పొడిగిస్తామని చెప్పి బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదని అన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ కేవలం ముఖ్యమంత్రి కమిషన్ల బడ్జెట్‌గానే ఉందని వ్యాఖ్యానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement