అప్పులబాధతో రైతు ఆత్మహత్య | The farmer committed suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Apr 13 2016 8:01 PM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన రాపర్తి రవి(37) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.

కరీంనగర్ జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన రాపర్తి రవి(37) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రవికి రెండెకరాల భూమి ఉంది. మూడేళ్లుగా వరి సాగు చేస్తున్నాడు. వర్షాలు సరిగా లేక దిగుబడి రాలేదు.

దీంతో జీవనోపాధి కోసం ఆటో కొనుగోలు చేశాడు. ఆటో సైతం సరిగా నడవక .. రోజు గడవటం కష్టమైంది. రూ.2 లక్షలు అప్పులయ్యాయి. కుటుంబపోషణ భారం కాగా, అప్పులు ఇచ్చినవారు కట్టాలని వేధిస్తుండడంతో మనస్తాపం చెంది బుధవారంఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. రవికి భార్య మౌనిక, కుమార్తె వైష్ణవి(5), కుమారుడు అభిరామ్(3) ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement