కాళేశ్వరంలో ప్రముఖుల స్నానాలు | lagadapati rajagopal holy dip in kaaleshvaram | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో ప్రముఖుల స్నానాలు

Jul 19 2015 5:01 PM | Updated on Sep 3 2017 5:48 AM

కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం పలువువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం పలువువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు.  తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితోపాటూ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పుణ్యస్నానాలు చేశారు.

మరో వైపు కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కరాల్లో రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయానికి 3.5 లక్షల మంది స్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కాళేశ్వరం- మహదేవపూర్ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement