నలుగురు క్రికెట్ బుకీల అరెస్టు | cricket-betting-four-bookies-arrested | Sakshi
Sakshi News home page

నలుగురు క్రికెట్ బుకీల అరెస్టు

Mar 3 2016 11:23 AM | Updated on Aug 20 2018 4:44 PM

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పోలీసులు గురువారం నలుగురు క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు.

ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణ పోలీసులు గురువారం నలుగురు క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు. స్థానిక శివాలయం వీధిలో బుధవారం జరిగిన బంగ్లాదేశ్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్ లు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో కర్ణాటకకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే బీటెక్ స్టూడెంట్‌తోపాటు జింకా చంద్రశేఖర్, లక్ష్మీనరసయ్య, వెంకటరమణ అనే వారు ఉన్నారు. వారి నుంచి రూ. 2.20 లక్షల నగదుతో పాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సైలు మంజునాథరెడ్డి, ఆంజనేయులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement