నగరంలో సీఐల బదిలీకి రంగం సిద్ధం | circle inspectors transfers in vijayawada city | Sakshi
Sakshi News home page

నగరంలో సీఐల బదిలీకి రంగం సిద్ధం

Dec 16 2015 11:34 AM | Updated on Aug 13 2018 3:00 PM

కాల్ మనీ వ్యవహారం విజయవాడ నగర పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంది.

విజయవాడ : కాల్ మనీ వ్యవహారం విజయవాడ నగర పోలీసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న పలువురు సీఐల బదిలీకి బుధవారం రంగం సిద్ధమైంది. కాల్ మనీ బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అందులో ప్రమేయం ఉన్న పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు.

సదరు జాబితాతో కూడిన ఫైల్ను అనుమతి కోసం పోలీసు కమిషనర్కి పంపారు. మరికాసేపట్లో ఆ ఫైల్పై సంతకం చేసి... ఆ వెంటనే ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని తెలిసింది. కాల్ మనీ వ్యాపారులకు సహకరించి.. తమను వేధింపులకు గురి చేశారని బాధితులు నగర పోలీసు కమిషనర్కి ఫిర్యాదు చేశారు. అందులోభాగంగా ఆరోపణలు వెల్లువెత్తిన పోలీసుల జాబితా సిద్దం చేయాలని కమిషనర్ కింది అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కాల్ మనీలో ప్రమేయం ఉన్న వారి జాబితాను సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement