గురుకుల సంస్థలు మెరవాలంటే..?

IYR Krishna Rao Article On Residential Gurukul Education In Telugu States - Sakshi

పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టక ముందు కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్‌లో విద్యాశాఖ నిర్వహించారు. సీఎం అయ్యాక విద్యా రంగంలో ఉన్న అనుభవంతో  కొన్ని వినూ త్న కార్యక్రమాలు చేపట్టారు. అలా మొదలైనవే రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభా వంతులైన విద్యార్థులను ఒక చోట చేర్చి ఉన్నత ప్రమాణాలతో  విద్యను బోధించడమే వాటి ప్రధాన ఉద్దేశం. అందుకు అనుగుణంగా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపకారవేతనాల ద్వారా విద్యార్థులకు కల్పించారు.

వారి దృష్టి చదువు మీద కేంద్రీకరించేట్లు చేయడమే ప్రధాన లక్ష్యం. ఈ విధా నానికి అనుగుణంగా తెలంగాణ ప్రాంతంలోని సర్వేల్, కోస్తా ప్రాంతంలోని తాడికొండ, రాయలసీమలోని కొడిగెనహళ్లిలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభించారు. 1972లో స్వాతంత్య్ర రజతో త్సవాలను çసందర్భగా కర్నూలులో రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలగా సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటుచేశారు. తర్వాత నాగార్జునసాగర్‌లో రెసి డెన్షియల్‌ జూనియర్‌ కళాశాల స్థాపనతో  రాష్ట్రం లో రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల ఏర్పాటు పూర్తయింది. 

పీవీ  కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ స్వీకరించాక దేశవ్యాప్తంగా నవోదయ స్కూళ్ల పేరుతో ఇలాంటి రెసిడెన్షియల్‌  సంస్థలను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. గ్రామీణ యువకులకు నాణ్యతతో కూడిన విద్య అందించడంలో ఈ సంస్థలు ముఖ్యపాత్ర పోషించాయి. 1972లో స్థాపిం చిన సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కాలేజీ ప్రథమ బ్యాచ్‌ విద్యార్థుల్లో నేను ఒకడిని. అప్పటికే ఎస్సీ, ఎస్టీల కేకాక బీసీలకు  రిజర్వేషన్లు వర్తింప చేయడంతో ఆ కాలేజీ విద్యార్థులు వివిధ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గల కుటుంబాల నుంచి వచ్చారు. విద్యా ర్థులను రాష్ట్రం లోని మూడు ప్రాంతాల నుంచి దామాషాలో తీసుకోవడం వల్ల అన్ని ప్రాంతాల విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో నివసించే అవకాశం లభించింది. 

హాస్టల్లో నా గదిలో నాతోపాటు ఉన్న వారిలో కోయిలకుంట్లకు చెందిన గాబ్రియల్‌ సుధాకర్‌ ఒకరు. ఆయన తం్రyì  గ్రామంలో పాస్టర్‌గా పనిచేసే వారు. కొడుకును చూడడానికి వచ్చినప్పుడు హాస్టల్‌ లో మాతో పాటే ఉండేవారు. ఈ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు విద్యాశాఖ నిర్వహించేది. క్రమక్రమంగా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు ఏర్పాటు మొదలైంది. వెనుకబడిన తరగతుల శాఖ, షెడ్యూల్‌ కులాల శాఖ కింద వేర్వే రుగా ఈ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం మొద లైంది. నేడు మైనారిటీల కూడా ప్రత్యేకంగా రెసిడె న్షియల్‌ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థల్లో కూడా ఇతరులకు కొన్ని సీట్లు కేటాయిం చినాగాని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఎంపికల్లో ఉన్న విశాలత వీటిలో లోపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 842 రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు 3లక్షల విద్యార్థులతో మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో నడుస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ 454 రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు రెండు లక్షల విద్యార్థులతో పదమూడు వందల కోట్లతో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఏపీ కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తోంది. రెసిడెన్షియల్‌  విద్యాసంస్థలు సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ నిర్వహణలో మరో ప్రభుత్వ కార్యక్రమంలాగానే చాలా రోజులు నడిచాయి. వీటిపై శ్రద్ధ పెట్టిన నాథు డు లేక  గణనీయ ఫలితాలను ఈ సంస్థలు సాధిం చలేకపోయాయి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థలు మాత్రం 2012 తర్వాత ప్రవీణ్‌ కుమార్‌ ఈ సంస్థ కార్యదర్శి కావడంతో మంచి ఫలితాలు చూపించడం మొదలెట్టాయి. ఐపీఎస్‌కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ ఇలాం టి విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసి అఖిలభారత సర్వీస్‌ అధికారిగా ఎదిగారు. సమాజానికి తన వంతు చేయాలనే సదుద్దేశంతో ఈ శాఖలో పని చేయడానికి వచ్చి గత ఆరేళ్ల నుంచి ఈ సంస్థల నిర్వహణలో గణనీయ మార్పు తెచ్చారు. ఈ సంస్థల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు  జేఎన్‌యూ వంటి ప్రసిద్ధ సంస్థల్లో సులభంగా సీట్లు సంపా దించు కుంటున్నారు. 

ఈమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి అగ్రవర్ణ పేదలకు ఇలాంటి రెసిడెన్షియల్‌ సంస్థలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వేరువేరుగా ఈ రెసిడెన్షి యల్‌ విద్యాసంస్థలను నిర్వహించడం వాంఛనీయం కాదు. అక్కడ చదివే విద్యార్థులకు వివిధ సామాజిక ఆర్థిక పరిస్థితుల నుంచి వచ్చే విద్యార్థులతో కలిసి మెలిసి ఉండే అవకాశం ఉండదు కాబట్టి సంకుచిత ధోరణి ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను ఒకే గొడుగు కింది కి తెచ్చి అన్ని వర్గాల విద్యార్థులు కలసి చదువుకునే విధంగా ఏర్పా టు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న విద్యా సంస్థ్థలను సమగ్ర రెసిడెన్షియల్‌ విద్యా సంసలుగా మార్పు చేస్తే మంచిది. దీనివల్ల విద్యార్థుల ఎంపి కలో ఇప్పుడున్న దామాషా పద్ధతికి ఎలాంటి భంగం కలగదు. లేకుంటే ఈ విద్యా సంస్థలు విద్యార్థులకు విశాల దృక్పథం ఏర్పడడానికి దోహదం చేయవు.

ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
yrk45@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top