పట్టిపీడిస్తున్న పాత ‘పాపం’ ?!

ABK Prasad Article On Chandrababu Naidu - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో పర్సనల్‌ అకౌంట్ల పేరిట వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్‌ తాజా సర్వే(2015–16) నివేదిక వెల్లడించడంతో ఇది పెద్ద సంచలన సంక్షోభంగా మారింది. ఈ డిపాజిట్లలోని నిధులు ఖర్చుకాకపోతే అవి తిరిగి ప్రభుత్వ పద్దులకే జమ పడాలి. అంతేగాని, ఈ సొమ్ము పాలకుల ఇష్టానుసార స్వార్థ ప్రయోజనాలకు మళ్లించడానికి వీలులేదని కాగ్‌ చాలా స్పష్టంగా చెప్పింది. నాలుగేళ్లు గడుస్తున్నా అకౌంట్ల వివరాలకు అతీగతీ లేదని విమర్శించింది. ఒకవేళ ఖర్చుకాక మురిగిపోయే స్థితిలో ఉంటే అలాంటి పద్దులు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమపడాలి కదా అని కాగ్‌ ప్రభుత్వాన్ని గుంజినా ఉలుకూ పలుకూ లేదు. ఈ బాగోతం బాబు పాలనలోనే మొదలైంది.

ఏ ప్రభుత్వానికైనా తన ద్రవ్య (ఆర్థిక) లావాదేవీలకు సంబంధించిన సవ్యమైన, విశ్వ సించదగిన, ఆరోగ్యకరమైన నివేదికను ప్రజలకు తెలియజేయాలి. ఏ విషయం దాచిపెట్టకుండా ఆ పని చేస్తేనే ఆ ప్రభుత్వం సామర్థ్యంగల, పకడ్బందీగా వ్యవహరించగల పాలనావ్యవస్థగా పరిగణ నలోకి వస్తుంది. ద్రవ్య నిబంధనలను, వాటిని పాటించడానికి అవసర మైన క్రమ పద్ధతులను, ఆదేశాలను సకాలంలో నిర్వహించగలిగితేనే అది సుపరిపాలనా లక్షణాల్లో ఒకటిగా (గుడ్‌ గవర్నెన్స్‌) భావించాలి.
– ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై 2015–16 సంవత్సరానికి కాగ్‌ నివేదిక

ఈ సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల వ్యక్తిగత డిపాజిట్‌ అకౌంట్ల (పీడీ అకౌంట్లు) ద్వారా రూ.53,039 కోట్లు దారిమళ్లాయి. వాటి గురించి వివరణ కోరితే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అమాంబాపతు (మిస్‌లీనియస్‌) పద్దు పేరిట ఉన్న ఈ సొమ్ముకు లెక్కలు  చూపాల్సిన పని ఉండదన్న సాకుతో ఈ మొత్తాలు గల్లంతవుతున్నాయి. ఇలాంటి అకౌంట్లు గుజరాత్‌లో 475, పశ్చిమ బెంగాల్‌లో 153 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ఏకంగా 58,418 అకౌంట్లు తెరచి, వాటి ద్వారా ఏకంగా రూ.53,039 కోట్లను మళ్లించింది. 
– అదే ‘కాగ్‌’ నివేదిక

తెగువ అనేది దేవేంద్ర పదవి అని పెద్దలు ఎందుకన్నారోగాని ముఖ్యమంత్రి పదవిని అలా భావించుకునే పాలకులు ఎందుకైనా తెగిస్తారని కడచిన వారంలో సంభవించిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రజాధనం దుర్వినియోగంలో కొందరు పాలకులకు వెరపు ఉండదు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో కోర్టు తీర్పులను సైతం ధిక్కరించే ధైర్యసాహసాలు వీరికున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, ద్రవ్య వ్యవహారాల నిర్వహణలోనూ కేంద్రీయ ‘కాగ్‌’ నిఘా అంచనాలను, హెచ్చరికలను ఈ నాయకులు ఖాతరు చేయడం లేదు. రానున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల దృష్ట్యా వారు అనుసరి స్తున్న లోపాయికారీ ఎత్తుగడలు ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నాయి. ప్రతిపక్షాలను ఎదుర్కునే తీరులో సైతం అన్ని ప్రమాణాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాతంత్ర విలువలను విస్మరిస్తున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లో తాజా ఉదాహరణ– ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని సుమారు ఐదారు జిల్లాల్లో రేపటి ఎన్నికల్లో ప్రతి పక్షాల ఓట్లను ఏ పద్ధతుల్లో తారుమారు చేయొచ్చో రోజుకో తీరున పాలకులు ‘పన్ను గడ’కు దిగుతున్నారు. మరోవైపు నుంచి పాలనా నిర్వ హణలో పాలకులు అనుసరిస్తున్న చౌకబారు ఎత్తుగడలనూ ప్రజలు గమ నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంస్థలు ఇంతకాలం ఓటింగ్‌ సమ యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పెట్టినా అవి తరచూ మొరాయి స్తున్నాయి. దీనికి కారణం వాటిని ఆపరేట్‌ చేసే సిబ్బందికి సరైన శిక్షణ లోపించిందనే సాకులు చెప్పడం మినహా సమస్యను పరిష్కరించడం లేదు. సాంకేతిక లోపాల వల్ల ఎన్నిక ప్రక్రియ ఓ పక్క ఇలా కుంటి నడ కన ముందుకు సాగుతుంటే– ముందస్తుగానే ప్రతిపక్షాల అభిమాను లుగా భావించే ప్రజల ఓటు హక్కుపై వేటు వేయడానికి కొన్ని పాలకప క్షాలు ప్రయత్నిస్తున్నాయి. అధికారపక్షం నేతలు ఎన్నికల కమిషన్‌ అధి కారులు, స్థానిక అధికారుల తోడ్పాటుతో గత నాలుగు ఎన్నికల్లోనూ అన్ని ఆధారాలతో నమోదైన కుటుంబ సభ్యుల ఓట్లను వేలు, లక్షల సంఖ్యలో తొలగించే ప్రక్రియకు తెర లేపడం విశేషం. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలం ఉన్న ప్రధాన కేంద్రా లన్నింటిలోనూ గత కొద్ది రోజులుగా ఈ ఓట్ల తొలగింపు పని మొద లుబెట్టారు. ఇది ఒక్క వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకే పరిమితంగాకుండా కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సాగుతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ జిల్లాల్లో నాలుగేళ్ల లోపే లక్షలాది మంది ఓటు హక్కును కత్తిరించారు. ఓట్లు కోల్పోయిన వారిలో మేయర్లు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు పదుల సంఖ్యలో ఉండడం విశేషమేగాక విచిత్రం కూడా. 

ఆంధ్రప్రదేశ్‌లో పర్సనల్‌ అకౌంట్ల పేరిట వేల కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టు కాగ్‌ తాజా సర్వే (2015–16) నివేదిక వెల్లడించ డంతో ఇది పెద్ద సంచలన సంక్షోభంగా మారింది. ఈ డిపాజిట్లలోని నిధులు ఖర్చుకాకపోతే అవి (మురిగిపోయినట్టుగా పరిగణించి) తిరిగి ప్రభుత్వ పద్దులకే జమపడాలి. అంతేగాని, ఈ సొమ్ము పాలకుల ఇష్టా నుసార స్వార్థ ప్రయోజనాలకు మళ్లించడానికి వీలులేదని నివేదికలో కాగ్‌ చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే, ట్రెజరీస్‌–అకౌంట్స్‌ డైరెక్టర్‌ నిర్వహించే మొత్తం 181 రకాల ప్రధాన పద్దులకు సంబంధించి 58,418 ఖాతాలు తెరచి, అధికారుల కళ్లు మూసి అన్ని వేలకోట్ల రూపాయలు ఎలా దారి మళ్లించిందనే ప్రశ్న కాగ్‌కు ఎదురైంది. ఈ విషయం మరింత చక్కగా వివరిస్తూ, ‘‘పర్సనల్‌ డిపాజిట్‌ పద్దులకు చేరిన చెల్లింపుల వివరాల్లో చెక్‌ నంబరు, డిపాజిట్‌ అయిన మొత్తం, చెక్కు విడుదల చేసిన తేదీ ఉండి తీరాలి. కాని, చెక్కు ద్వారా డబ్బు ఎవరికి చెల్లించారో వారి పేరుగాని, ఆ చెక్కును మార్చి సొమ్ము చేసుకున్నవారి పేరుగాని అందులో లేవు’’ అని కాగ్‌ తన నివేదికలో వెల్లడించింది. నాలుగేళ్లు గడు స్తున్నా అకౌంట్ల వివరాలకు అతీగతీ లేదని విమర్శించింది. ఒకవేళ ఖర్చు కాక మురిగిపోయే స్థితిలో ఉంటే ఆ మొత్తాలు తిరిగి సంచిత నిధికి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) చేరాలి. అంటే, కాలం చెల్లి, మురిగిపోయిన పద్దు లేమైనా ఉంటే తిరిగి ప్రభుత్వ ఖాతాలోకి జమపడాలి కదా అని కాగ్‌ ప్రభుత్వాన్ని గుంజినా ఉలుకూ పలుకూ లేదు. ఈ బాగోతం బాబు పాలనలోనే మొదలైంది. 

ఈ పోకడలను పద్నాలుగేళ్ల క్రితమే ప్రపంచ బ్యాంక్‌ పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు రుణాల రూపంలో తామిచ్చిన నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఖర్చుచేసిందో తెలుసుకోవాలని ఈ బ్యాంక్‌ భావిం చింది. ఈ నిధులతో క్షేత్రస్థాయిలో అమలవుతున్న పథకాల తీరుతెన్ను లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని డీఎఫ్‌ఐడీ (డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంట ర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌) నియమించిన ప్రొ.జేమ్స్‌ మేనర్‌ను ఆంధ్ర ప్రదేశ్‌కు పంపించారు. మేనర్‌ తన సర్వే నివేదిక (2002–2004)లో, ‘‘చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం భారత దేశంలోనే అత్యంత కేంద్రీకృత, ఆధిపత్య విధానాలు అమలు చేస్తోంది. నిర్ణయాధికారంలో ఆయనది నిరంకుశ ధోరణి. తాను పెత్తనం చెలా యించలేని సంస్థలకు వనరులు, అధికారాలు అందకుండా చేస్తారా యన. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలిచ్చే ఆర్థిక సంస్థలు ఆయా ప్రభుత్వ శాఖాధిపతులతోనే ప్రధానంగా చర్చలు జరుపుతాయి. కాని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మా డీఎఫ్‌ఐడీ రుణ సంస్థ కేవలం ఒక్క వ్యక్తితోనే అంటే ముఖ్యమంత్రితోనే సంప్రదించాలి. ఈ ప్రభుత్వం సమ ర్పించే లెక్కలు నమ్మదగినవిగా ఉండవు. ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి సమర్పించే లెక్కల విషయంలో గోరంతలు కొండంతలు చేసి చూపిం చడం జరుగుతోంది. వీటికి విధిగా సోషల్‌ ఆడిట్‌ జరపడం అవసరం. ప్రజాధనాన్ని నిర్లక్ష్యంగా ఖర్చుపెట్టేస్తున్నారు. పైగా, తన ప్రభుత్వం ప్రజాధనాన్ని చాలా పొదుపుగా ఖర్చు పెడుతున్నదని ముఖ్యమంత్రి చెబుతుంటారు.

ప్రజలపట్ల ఆయనకు పారదర్శకత పూజ్యం. ఇక ఈయన హయాంలో అవినీతి మూడు స్థాయిల్లో (అధికార కేంద్రంలో/ మధ్య స్థాయిలో/జిల్లా స్థాయిలో) చెలరేగిపోయింది. ప్రభుత్వ కాంట్రాక్టులను ముంజూరు చేయడానికి భారీగా లంచాలు గుంజుతున్నారు. రూ.10 లక్షల విలువ కలిగిన పనులకు కాంట్రాక్టు ఇవ్వడానికి  ముడుపులు (కిక్‌ బాక్స్‌) చెల్లించాల్సిందే. మధ్యస్థాయిలోని ఉన్నతాధికారులు ఆయా సంస్థలు లాభాలు గుంజడానికి అనుమతిస్తున్నారు. ఫండింగ్‌ ఏజెన్సీగా డీఎఫ్‌ఐడీ సమకూరుస్తున్న నిధుల్లో మూడింట ఒక వంతు నిధుల్ని లెజిస్లేటర్లు పక్క వాటుగా మరల్చుకుంటున్నారు. పనులు చేసి పెట్టే పేరిట అనేక క్రిమినల్‌ ముఠాలకు ముడుపులు అందుతున్నాయి. ఇక జిల్లా స్థాయిలోనూ, అంతకు కింది స్థాయిలోనూ ముఖ్యమైన పనులు చేసి పెట్టడానికి, లైసెన్సులు, పర్మిట్లు, ఇతర సేవలు అందించడానికి పౌరుల్ని అధికారులు వేధిస్తున్నారు. ఈ ప్రక్రియ మూలంగా ముడు పులు, లంచాలు చెల్లించుకోలేని పేదసాదలకు ఈ దోపిడీ భారంగా మారింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చు కోవడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర సర్కారు చేయని ప్రయ త్నమంటూ లేదు. తామనుకున్న విధంగా పాలన సాగించడానికి చేయా ల్సినదంతా చేస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలు గాలికి వదిలి పరిపా లన సాగిస్తున్నారు. అలాగే, ఏళ్లూ పూళ్లుగా పడి ఉన్న కేసుల పరిష్కారం కోసం గానీ, జిల్లా కోర్టుల్ని వేధిస్తున్న అవినీతి నిర్మూలనకు ప్రయత్నాలు జరగలేదు. న్యాయం కోసం అంగలారుస్తున్న పేదసాదలకు న్యాయం చేయడానికి తలపెట్టిన సంస్కరణలు ఏవీ కనిపించలేదు’’ అని వెల్లడిం చారు. ఈ నివేదిక వివరాలను నాడు ఇంగ్లిష్‌ దినపత్రిక  ‘హిందూ’  కూడా (2004 జనవరి 9) ప్రచురించింది. ఇంక ముంజేతి కంకణానికి అద్దమెందుకు? ఆనాటి బాబు కథే తిరిగి మరొక రూపంలో కొనసాగు తుందని చెప్పడానికి!!


ఏబీకే ప్రసాద్‌,సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@ahoo.co.in 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top