కొందరు నవ్వించడానికి రకరకాల ప్రయత్నిస్తారు. వారి వీర ప్రయత్నాలను చూసి మనకు నీరసం వస్తుంది తప్ప నవ్వు మాత్రం రాదు. అయితే కొందరు పెద్దగా ఏ ప్రయత్నమూ చేసినట్లు కనిపించరు. మౌనంగా నవ్వుల మంత్రదండాన్ని తిప్పుతారు. అంతే! మనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది.
కొందరు నవ్వించడానికి రకరకాల ప్రయత్నిస్తారు. వారి వీర ప్రయత్నాలను చూసి మనకు నీరసం వస్తుంది తప్ప నవ్వు మాత్రం రాదు. అయితే కొందరు పెద్దగా ఏ ప్రయత్నమూ చేసినట్లు కనిపించరు. మౌనంగా నవ్వుల మంత్రదండాన్ని తిప్పుతారు. అంతే! మనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది. ఈ రెండో కోవకు చెందినవాడు ఇరాన్ కార్టూనిస్ట్ మెహదీ అలిబెజీ. ఆయన వర్ణరేఖలు ఎలాంటి శబ్దాడంబరం లేకుండానే గిలిగింతలు పెడతాయి.
ఇరాన్‌లో అడుగు పెట్టగానే కళా హృదయులకు ‘కార్టూన్ల దేశం’లో అడుగుపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. అంతటా మహామహులు కనిపిస్తూనే ఉంటారు. ఒకరిని చూసి ‘మహాను భావా మీ కార్టూన్ ఉంది చూశారూ’ అనేలోపే అభిమాన కార్టూనిస్ట్ మరెవరో కనిపిస్తూనే ఉంటారు. ఆ దేశం నిండా అంత గొప్ప కార్టూనిస్టులన్నారు మరి. వాళ్లలో ఒకరు మెహదీ.
మెహదీ హసన్ గజల్స్ వింటుంటే, అమృతం పరవళ్లు తొక్కుతున్న అనుభూతి కలుగుతుంది. మెహదీ హసన్ రేఖల్లో నవ్వులగంగ ఉప్పొంగిపోతుంది. ‘భాషతో నీకు పనిలేదు’ అన్నట్టుగా ఒక్క అక్షరం లేకుండానే అందమైన కార్టూన్లను అందించిన గొప్ప కార్టూనిస్టు మెహదీ. సామాజిక, రాజకీయ అంశాలే కాదు... ఆయన ఆయన దృష్టి నుంచి ఏ ఒక్క విషయమూ తప్పిపోదు. ‘రవి గాంచని చోటు కవిగాంచును’ అన్న నానుడిని, ‘కవి గాంచని చోటును సైతం కార్టూనిస్ట్ గాంచును’ అని మార్చేశారు మెహదీ!
పందొమ్మిదో ఏట నుంచి నవ్వులు పూయిస్తున్న మెహదీ... ఇప్పుడు ఓ పే....ద్ద నవ్వుల తోటకు యజమాని. ఆ తోటలో పూసిన ఒక పువ్వు ఇది. దాని హాస్య పరిమళాన్ని హాయిగా ఆస్వాదించండి!