ఓ తాత.... మనవడి కథ | Story on Ashok Gajapathi Raju and Alak Narayana Gajapathi Raju | Sakshi
Sakshi News home page

ఓ తాత.... మనవడి కథ

May 28 2014 9:13 AM | Updated on Sep 2 2017 7:59 AM

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న అశోక్, అలక్ నారాయణ గజపతి రాజు

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న అశోక్, అలక్ నారాయణ గజపతి రాజు

అది 1920వ సంవత్సరం. ఉత్తర భారతంలోని సంపన్న కుటుంబానికి చెందిన ఒకాయన, దక్షిణ భారతంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన మరొకాయనకు విమానం కొనుగోలు చేయాలనే తలంపు కలిగింది.

అది 1920వ సంవత్సరం. ఉత్తర భారతంలోని సంపన్న కుటుంబానికి చెందిన ఒకాయన, దక్షిణ భారతంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన మరొకాయనకు విమానం కొనుగోలు చేయాలనే తలంపు కలిగింది. అనుకున్నదే తడవుగా ఇద్దరు ఇంగ్లాండ్ పయనమయ్యారు. ఇద్దరు చెరో విమానాన్ని కొనుగోలు చేశారు. ఆ విమానాల్లో దర్జాగా ఇండియా తిరిగి వచ్చారు.  ఉత్తర భారతానికి చెందిన ఆసామీ తాను కొనుగోలు చేసిన విమానాన్ని ప్రయాణికుల కోసం విమాన సర్వీసును ఏర్పాటు చేశాడు. రెండో ఆయన మాత్రం తాను కొనుగోలు చేసిన విమానాన్ని తన సొంతానికి వినియోగించుకున్నాడు.

ప్రయాణికుల కోసం విమాన సర్వీసు ప్రారంభించిన వ్యక్తి  జంషెడ్‌ జీ టాటా కాగా... విమానంపై మక్కువతో తమ సొంతానికి ఉపయోగించుకున్న వ్యక్తి  అలక్ నారాయణ గజపతి. ఈ అలక్ నారాయణ్ ఎవరో కాదు.... ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయనగరం ఎంపీ, టీడీపీ నేత అశోక్ గజపతి రాజుకి స్వయాన తాతయ్య.  

1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.వీరభద్రస్వామి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా మోడీ కేబినేట్లో పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు బాధ్యతులు చేపట్టారు. దాంతో అనగనగా ఓ రాజుగారికి మంత్రి పదవి దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement