దెబ్బతింటున్న మైనారిటీ మనోభావాలు | Sentiments of the minority are Damaging | Sakshi
Sakshi News home page

దెబ్బతింటున్న మైనారిటీ మనోభావాలు

Published Fri, Apr 17 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

రెహనా బేగం

రెహనా బేగం

గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా ముస్లింల పై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తు న్నారు.

 గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా ముస్లింల పై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ తదితర పార్టీల నేతలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తు న్నారు. ముస్లిం సమాజం పై ఎందుకు ఇలా వరుస దాడి జరుగుతోంది. ము స్లింలు, క్రిస్టియన్లు వేరు.. హిందువులు వేరు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే కుట్రవెనుక కారణాలు ఏమిటి? మైనా రిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, వారిలో తమ అస్తిత్వానికి సంబంధించిన ఆందోళన పెంచే విధంగా సంచలన వ్యాఖ్యలు చేయడం.. మీడియాలో అనివార్యం కావడం పథకం ప్రకారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలకు తోడుగా ఘర్‌వాపసీ, లవ్ జిహాద్ వంటి కొత్త నినాదాలు, కొత్త ప్రయ త్నాలు చాపకింద నీరులా సాగుతూనే ఉన్నాయి.

 ఈ సందర్భంగా గుజరాత్ గడ్డపై నాకు ఎదు రైన ఒక సంఘటన గుర్తుకొస్తోంది. 2012 డిసెం బర్‌లో గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కవరేజీ కోసం ఆ రాష్ట్రంలో రెండువారాలపాటు ఉన్నాను. ఎన్నిక పూర్తై సాయంత్రం నేను ఉంటున్న హోటల్‌కు చేరు కున్నాను. ఆ హోటల్ రూమ్‌బాయ్‌ని ఏ పార్టీకి ఓటే శావు అని అడిగాను. కమలానికి ఓటు వేశానని చెప్పాడు. ఎందుకు కమలానికే.. మోడీసర్కారు పని తీరు నచ్చిందా అనడిగాను. అతని నుంచి వచ్చిన సమాధానం ఇప్పటికీ నాలో తీవ్ర ఆలోచనను రేపు తుంటుంది. ‘మేము (హిందువులం) అధికారంలో లేకపోతే వాళ్లు (ముస్లింలు) మాపై దాడులు చేస్తా రు’. పాతికేళ్లు నిండని, పదోతరగతి కూడా ఉత్తీ ర్ణుడు కాని ఆ యువకుడు ఓటు వేసినప్పుడు చూసింది పాలనా దక్షతో, మరొకటో కాదు నాయకు డు హిందువు అయి ఉండాలి. అందులోనూ హిం దూత్వ భావజాలం జాస్తిగా ఉండే మోడీ వంటి అధి నాయకుడు అయి ఉండాలి. గుజరాత్‌లోనే కాదు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక వర్గం లేదా కొంత శాతం ఓటర్లు ఇదే ప్రాతిపదికన ఓటేశారనేది సత్యం. ఈ మేరకు తెరవెనుక ఆర్‌ఎస్ ఎస్ పథకం విజయవంతం అయిందనే చెప్పాలి.

 దేశం కోసం త్యాగాలు చేయడానికి భారతీయ ముస్లింలు వెనకాడరంటూ వ్యాఖ్యానించి, మోదీ వారి మీద వ్యతిరేకత లేదని చెప్పే ప్రయత్నం చేశా రు. కానీ ముస్లింల దేశభక్తి గురించి ఎవరూ కితా బులు ఇవ్వనవసరం లేదు. చరిత్రే ఇందుకు సాక్ష్యం. అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్ వంటి యోధులు దేశ స్వాతం త్య్రం కోసం పోరాడారు. ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ తన 95 ఏళ్ల జీవితంలో 45 ఏళ్లు  కారాగారంలోనే గడిపారు. అది కూడా భారత స్వాతంత్య్రోద్యమం కోసమే. పరదా వెనకే ఉన్నప్ప టికీ హజ్రత్ మహల్, అస్ఘరీ బేగం, బీ అమ్మా వంటి వారు కూడా దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడ్డారు. వీరి గురించి మాట్లాడే హక్కు ఈ నేతలకు ఉందా?

 ముస్లింలు, క్రిస్టియన్లు రాముడి సంతానమేనని ఒక నేత సూత్రీకరించారు. అన్ని మతాలు హిందూ మతం నుంచే వచ్చాయని ఆయన భావన. మరి సింధు నాగరికత గురించి, ఆర్య సంస్కృతి గురించి వీరు విస్మరించదలిచారా? ఈ మధ్య తరచు వినిపి స్తున్న వ్యాఖ్య ఎక్కువ మంది పిల్లలను కని, హిం దూ జాతి మనుగడను కాపాడడం. ముస్లింలు ఎక్కు వ మందిని కంటున్నారు కాబట్టి హిందువులు కనా లని వారి వాదన. కానీ ఇటువంటి ఆలోచనతో ముస్లింలు అధికంగా పిల్లలను కనడం లేదు. నిజా నికి 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 78 శాతం హిందువులే. ముస్లింలు, క్రైస్తవులు మైనారి టీలు. అయినా హిందూ జాతి ప్రమాదంలో పడిం దంటూ అధిక సంతానం పొందండంటూ చెప్పడం ఏమిటి? వీటన్నిటికీ కారణం అధిక సంతానం ప్రగ తికి నిరోధమనే చైతన్యం కొరవడడమే. అలాగే పుట్టెడు సంతానాన్ని సాకలేక బాలికలను ముసలి షేక్‌లకు ఇచ్చి పెళ్లి చేయడం మనం చూడడం లేదా? ముస్లింల మాదిరిగా హిందువులు కూడా ఇంటికి నలుగురిని కనమని చెప్పి, వారి వలెనే చదువులకు దూరంగా ఉండమని సలహా ఇస్తారా? ఒక భారత పౌరునిగా రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కు ను తొలగించమని ఎవరైనా ఎలా అడుగుతారు? హిందుత్వ భావనతో నిండిపోయిన నేతలకు ప్రతి సారి ముస్లిం ఎందుకు లక్ష్యంగా మారుతున్నాడు? ఇక్కడ అందరికీ గౌరవంగా జీవించే హక్కు సమా నమే. బాధ్యతాయుత స్థానాలలో ఉన్నవారు ప్రజ లను పెడతోవ పట్టించే ప్రచారాలు మానుకోవాలి.

 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
 మొబైల్: 94925 27352)

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement