పొలిటికల్ మదర్

పొలిటికల్  మదర్ - Sakshi


సాక్షి, సిటీప్లస్: ప్రపంచ ప్రసిద్ధ యూకే డ్యాన్స్ గ్రూప్ హోఫెష్ షెక్టర్ కంపెనీ తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టింది. ఈ గ్రూప్ హైదరాబాదీలను అలరించనుంది. ఈ కంపెనీ ప్రతిష్టాత్మక ఇంపల్స్ 2 సీజన్‌లో ‘పొలిటికల్ మదర్’ నృత్య ప్రదర్శన శుక్రవారం రాత్రి 7గంటలకు శిల్పకళావేదికలో జరగనుంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ హోటల్‌లో బుధవారం మీడియా సమావేశం జరిగింది. హోఫెష్ షెక్టర్ మాట్లాడుతూ..  తెలంగాణ టూరిజం శాఖ సహకారంతో జరుగుతున్న ఈ ప్రదర్శన కళల ప్రోత్సాహానికి వేదిక అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా డెరైక్టర్ రాబ్‌లెన్స్, తెలంగాణ టూరిజం జీఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top