నవ్వు.. నవ్వించు.. | Hyderabad ladies missing the enjoy due to Work pressure | Sakshi
Sakshi News home page

నవ్వు.. నవ్వించు..

Jul 29 2014 1:25 AM | Updated on Sep 7 2018 4:33 PM

నవ్వు.. నవ్వించు.. - Sakshi

నవ్వు.. నవ్వించు..

పని ఉచ్చులో చిక్కుకున్న సగటు హైదరాబాదీ ఆడవాళ్లు సంతోషానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. పని ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్నా.. ఇదే జీవితం అని మెంటల్‌గా ఫిక్సయిపోయారు.

పని ఉచ్చులో చిక్కుకున్న సగటు హైదరాబాదీ ఆడవాళ్లు సంతోషానికి ఆమడ దూరంలో ఉంటున్నారు. పని ఒత్తిడి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్నా.. ఇదే జీవితం అని మెంటల్‌గా ఫిక్సయిపోయారు. ఫిట్‌నెస్ కోసం పరుగులు తీస్తున్నారు.. యోగాసనాలు వేస్తున్నారు. అయితే ఆరోగ్యాన్ని ప్రసాదించే దివ్యౌషధం నవ్వును మాత్రం పూర్తిగా మరచిపోయారు. అందుకే అన్నీ ఉన్నా.. ఏదో వెలితితో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇలాంటి మహిళలకు మనసారా నవ్వుకునే అవకాశం కల్పించింది ఫన్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లో సోమవారం జరిగిన ఫన్‌కార్ కిట్టీ పార్టీ అందరికీ నవ్వులు పంచి పెట్టింది. కామెడీ స్కిట్స్, ఆటపాటలు, ఫ్యాషన్ షోతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది.  ‘నవ్వు మిస్సయితే.. జీవితంలో సంతోషం కూడా మిస్సవుతుంది. నవ్వు నాలుగు విధాలా గ్రేట్ అని చెప్పడానికే ఈ ఆర్గనైజేషన్ మొదలుపెట్టామ’ని ఫన్ సంస్థ నిర్వాహకురాలు సుశీల  బకాడియా వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement