స్త్రీలోక సంచారం

Womens empowerment: Aditi Rao Hydari for Mysskin's next? - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

గర్భిణులలో రక్తహీనత ఎక్కువగా ఉంటోందని ఇటీవలి ఒక సర్వేలో వెల్లడైన నేపథ్యంలో రక్తహీనతపై గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటైన ఒక సదస్సులో.. పొట్టు తియ్యని ధాన్యంతో చేసిన పల్చటి, మృదువైన ఆహారాన్ని.. చిన్నప్పటి నుంచే (మొదటి ఆరు నెలలు తల్లి పాలు పట్టించాక.. ఆ తర్వాతి నుంచీ) శిశువులకు అలవాటు చేస్తే పెద్దయ్యాక రక్తలేమి ఏర్పడే అవకాశాలు తక్కువవుతాయని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పాల్గొన్నవారిలో గైనకాలజిస్టులు, ఆబ్‌స్టెట్రీషియన్‌లు, హెమటాలజిస్టులు, పీడియాట్రీషియన్‌లు, సాధారణ వైద్యులతో పాటు పోషకాహార నిపుణులు కూడా ఉన్నారు. 

సైమోన్‌ అనే 93 వృద్ధురాలిని ఆమె పుట్టినరోజు అయ్యీ కాగానే, పోలీసులు ఇంటికొచ్చి మరీ అరెస్టు చేసి తీసుకెళ్లిన ఘటన యు.ఎస్‌.లోని మేన్‌ రాష్ట్రంలో జరిగింది. టీవీలో వచ్చే ‘కాప్స్‌’ సీరియల్‌కు ఇన్‌స్పైర్‌ అయిన తన తల్లి సైమోన్‌.. అరెస్టు అయితే ఎలా ఉంటుందో అనుభూతి చెందాలని ఉందని, అలాంటి అనుభూతిని తనకు పుట్టిన రోజు కానుకగా ఇవ్వమని అడగడంతో తనే పోలీసులకు చెప్పి, వారి సహృదయ పూర్వకమైన సహాకారంతో ఆమెను అరెస్టు చేయించానని సైమోన్‌ కూతురు యాన్‌ డ్యూమంట్‌ తెలిపారు!

ఒరిజినల్‌ తెలుగు చిత్రం ‘సమ్మోహనం’తో ఈ ఏడాదే టాలీవుడ్‌లోకి ప్రవేశించిన బాలీవుడ్‌ నటి అదితీరావ్‌ హైదరీ ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టి, ఢిల్లీలో చదివి, సినిమాల కోసం ముంబై వచ్చిన ఈ గాయని (మొదట గాయనే) తనకు హైదరాబాద్‌ అంటే ఎంత ఇష్టమో చెబుతూ, తనకిక్కడ షూటింగ్‌లో ఉన్నప్పుడు హోమ్‌లీగా ఉంటుందని అన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top