పనసతో ప్రయోజనాలెన్నో... | What are the benefits of jacket? | Sakshi
Sakshi News home page

పనసతో ప్రయోజనాలెన్నో...

Jun 5 2017 11:45 PM | Updated on Sep 5 2017 12:53 PM

పనసతో ప్రయోజనాలెన్నో...

పనసతో ప్రయోజనాలెన్నో...

పనస ఒక పవర్‌హౌజ్‌ లాంటిది. శక్తిని వెలువరించడంలో దానికి అదే సాటి.

గుడ్‌ఫుడ్‌

పనస ఒక పవర్‌హౌజ్‌ లాంటిది.  శక్తిని వెలువరించడంలో దానికి అదే సాటి. కొలెస్ట్రాల్‌ ఏమీ లేకుండా అత్యంత శక్తిని ఇచ్చే ఫ్రక్టోజ్‌ వల్ల ఈ శక్తి సమకూరుతుంది. పనస వల్ల ఒనగూరే ప్రయోజనాల్లో కొన్ని...

►పనస పండులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కావడం వల్ల అనేక రకాల క్యాన్సర్లకు స్వాభావిక నివారణిగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా పెద్దపేగు, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది.

►పనసలో మరెన్నో పోషకాలు (ఫైటోన్యూట్రియెంట్స్‌), ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నాయి. కణంలో దెబ్బతిన్న డీఎన్‌ఏలను సైతం చక్కదిద్దగల సామర్థ్యం వాటికి ఉంది.

►పనసలో విటమిన్‌–ఏ పాళ్లు ఎక్కువ. అందుకే అది కంటికి మేలు చేస్తుంది. అదీగాక క్యాటరాక్ట్, మాక్యులార్‌ డీ–జనరేషన్, రేచీకటి వంటి అనేక కంటివ్యాధులను నివారిస్తుంది.

►థైరాయిడ్‌ గ్రంథికి వచ్చే జబ్బులను నివారించడంతో పాటు  థైరాయిడ్‌  జీవక్రియలకు అవసరమైన కాపర్‌ను సమకూరుస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement