అమ్మడం నేరం

Special Act For Dog Babies in Western Australia - Sakshi

ఆస్ట్రేలియాలో 6 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక రాష్ట్రం వెస్టర్న్‌ ఆస్ట్రేలియా. ఇప్పుడా వెస్టర్న్‌ ఆస్ట్రేలియా ఒక కొత్త చట్టం తేబోతోంది. అది కనుక అమలులోకి వస్తే ఇక ముందు ఎవరు పడితే వాళ్లు కుక్కపిల్లల్ని అమ్మడానికి లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొన్ని దుకాణాలు ఉంటాయి. వాటిల్లో మాత్రమే అమ్మకాలు, కుక్కపిల్లల బ్రీడింగ్‌ జరుగుతాయి. వెస్ట్రర్న్‌ ఆస్ట్రేలియా ప్రీమియర్‌ (ప్రధానికి సమానమైన పదవి).. మార్క్‌ మెక్‌గోవన్‌ ఆలోచన ఇది. ‘‘కుక్కపిల్లల్ని కొంటున్న కుటుంబాలకు మనశ్శాంతిని ఇవ్వాలని సంకల్పించాం. దుకాణాలకు వెళ్లి కుక్కపిల్లల్ని కొనేటప్పుడు ఎన్నో శంకలు పీడిస్తుంటాయి. వాటి ఆరోగ్యం, వాటి పెంపకం సరిగానే ఉన్నాయా? టార్చర్‌ ఏమైనా పెట్టి ఉంటారా? పుష్టికరమైన ఆహారం అంది ఉంటుందా? ఇలా ఎన్నో! వాటన్నిటికీ దుకాణాలవాళ్లు చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఎక్స్‌లెంట్‌’ అని! నమ్మేదెలా? అందుకే ప్రభుత్వం కుక్కపిల్లల అమ్మకాన్ని, ఉత్పత్తిని తన చేతులలోకి తీసుకోబోతోంది’’ అని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు మార్క్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top