చెవి రంధ్రం సాగితే! | Should the ear hole! | Sakshi
Sakshi News home page

చెవి రంధ్రం సాగితే!

Feb 12 2014 11:37 PM | Updated on Sep 2 2017 3:38 AM

కమ్మలు పెట్టుకునే చెవి రంధ్రాలు కొందరికి మరీ సాగినట్టు కనిపిస్తాయి. కొందరికైతే సాగిన చెవి రంధ్రాలు తెగిపోయి కూడా కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ధరించడం వల్ల...

కమ్మలు పెట్టుకునే చెవి రంధ్రాలు కొందరికి మరీ సాగినట్టు కనిపిస్తాయి. కొందరికైతే సాగిన చెవి రంధ్రాలు తెగిపోయి కూడా కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఆభరణాలు ధరించడం వల్ల... వయసు పైబడి చర్మం బలహీనంగా మారడం వల్ల ఇలా జరుగుతుంటాయి. ఈ సమస్యకు రెండు పద్ధతుల ద్వారా చికిత్స ఉంటుంది.

కార్టిలేజ్ గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బలహీనంగా ఉన్న చెవి రంధ్రాన్ని పూర్తిగా మూసేసి, ఆ ప్రాంతంలో చర్మాన్ని శక్తిమంతం చేస్తాం. తర్వాత మళ్లీ రంధ్రం చేస్తాం. ప్లాప్ మెథడ్ ద్వారా చెవిరంధ్రాన్ని పూర్తిగా మూసేయకుండా  చిన్నదిగా మారుస్తాం. ఈ పద్ధతులకు ఒక గంట సమయం పడుతుంది. ఆ తరువాత గంటలో ఇంటికి వెళ్లిపోవచ్చు.
 
నోట్:
బరువున్న ఆభరణాలు దీర్ఘకాలం ఉపయోగించకూడదు. ఏ వయసు వారైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. ఆసుపత్రిని బట్టి రూ.10-15 వేలు ఖర్చు అవుతుంది.
 
- డా. మురళీమనోహర్ రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement