నిశ్చింతగా నారింజ తినవచ్చు... | Orange gastro reflux disease isophejiyal Stanford | Sakshi
Sakshi News home page

నిశ్చింతగా నారింజ తినవచ్చు...

Oct 24 2016 12:17 AM | Updated on Sep 4 2017 6:06 PM

నిశ్చింతగా నారింజ తినవచ్చు...

నిశ్చింతగా నారింజ తినవచ్చు...

నారింజపండు కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల పుల్ల తేన్పులతో కనిపించే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) వంటి సమస్యలు ...

నారింజపండు కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి దీన్ని తినడం వల్ల పుల్ల తేన్పులతో కనిపించే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు ఈ పండు తినరు. కానీ స్టాన్‌ఫోర్డ్ సంస్థ అధ్యయనం ప్రకారం ఈ విషయానికి తగిన ఆధారాలు దొరకలేదు. కాబట్టి పులితేన్పులను ఈ పండు ఎక్కువ చేస్తుందనే అపోహ వీడి హాయిగా తినవచ్చు. ఇక నారింజలో పీచు కూడా ఎక్కువే. అయితే దీన్ని పండుగా తింటేనే పీచు మనకు లభ్యమవుతుంది.

అయితే జ్యూస్ తీసినప్పుడు పీచును చాలావరకు కోల్పోయే అవకాశాం ఉంది. కాబట్టి  దీన్ని పండుగా తినడమే మంచిది. అదీగాక మిగతా పండ్లలో ఉండే చక్కెర వేగంగా విడుదల అవుతుందేమోగాని... నారింజ పండు తిన్నవారిలో దీనివల్ల లభ్యమయ్యే చక్కెర చాలా మెల్లగా శరీరంలోకి విడుదల అవుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అందుకే చక్కెరవ్యాధి గ్రస్తులు సైతం నిరభ్యంతరంగా దీన్ని తినవచ్చు. వాళ్లకూ ఇది సురక్షితమైన పండు అని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement