టు కె రన్‌ | "Miss plesd Minds' the company created a mobile game | Sakshi
Sakshi News home page

టు కె రన్‌

Jan 15 2017 11:50 PM | Updated on Sep 5 2017 1:17 AM

టు కె రన్‌

టు కె రన్‌

ఇటీవల భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘మిస్‌ ప్లేస్‌డ్‌ మైండ్స్‌’ సంస్థ ఒక మొబైల్‌ గేమ్‌ రూపొందించింది.

మొబైల్‌ గేమ్‌

ఇటీవల భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘మిస్‌ ప్లేస్‌డ్‌ మైండ్స్‌’ సంస్థ ఒక మొబైల్‌ గేమ్‌ రూపొందించింది. ఆండ్రాయిడ్‌లో వచ్చిన ఈ గేమ్‌ పేరు ‘టు కె రన్‌’. కరెంట్‌ టాపిక్‌ని ఆధారంగా మన దేశంలో ఒక గేమ్‌ మార్కెట్‌లోకి రావడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ క్యారికేచర్‌లతో యానిమేషన్‌ చేసి రూపొందిన ఈ గేమ్‌ను జనవరి మొదటి వారంలో మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఈ గేమ్‌లో... ఎన్నికల గుర్తుతో నోట్లను కొల్లగొడుతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ను అదుపు చేస్తున్న కానిస్టేబుల్‌గా మోడీ లాఠీతో కనిపిస్తారు. ఈ గేమ్‌ ఆడేందుకు తేలిగ్గా ఉంది. చూడటానికి ఆసక్తికరంగా ఉంది. సూర్యప్రకాశ్‌ (విజయవాడ), చంద్రధర్, సాయి తేజ, మోహనవంశీ, శిఖాశర్మ (హైదరాబాద్‌) ఈ గేమ్‌ రూపకర్తలు. గూగుల్‌ ప్లే నుంచి దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement