షో క్విజ్ | Sakshi
Sakshi News home page

షో క్విజ్

Published Sat, Oct 28 2017 11:56 PM

Ilayaraja Live Show in hyderbad

వంద వయొలిన్లు ఆకాశానికి తల ఎత్తుతాయి. వేణువొక్కటి హృదయంలో వలపు వొంపుతుంది. నాదమ్‌ ధమ్‌ధమ్‌మంటూ ధ్వానం చేస్తుంది. కీబోర్డు కువకువలతో బంధనం బిగిస్తుంది. ఇళయరాజా లైవ్‌! హైదరాబాద్‌లో మొదటిసారిగా గ్రాండ్‌ గాలా షో.  వేలు, లక్షలు, యక్షులు ఎదురు చూసే షో. చూడటం ఎలా? నో ప్రాబ్లమ్‌! మా పాఠకులకు మేము వీలు కల్పించదలుచుకున్నాం. ఇళయరాజాపై తయారు చేసిన ఈ క్విజ్‌లో గెలిచిన వారికి ఫ్రీ పాసులు లక్కీ డ్రా తీసి కానుకగా ఇవ్వదలిచాం. పెన్ను అందుకోండి. స్నేహితులతో కూపీ లాగండి. గెస్‌ చేయండి. గూగులమ్మను అడగండి. కరెక్ట్‌ ఆన్సర్స్‌ రాసి కన్సర్ట్‌లో మీ సీట్‌ గెలుచుకోండి. రాజా కాలింగ్‌! జల్దీ ఆజా!!

‘సుందరమో సుమధురమో చందురుడంటిన చందన శీతలమో’... పాటను ‘అమావాస్య చంద్రుడు’లో ఎవరు రచించారు.
a) వేటూరి
b) ఆత్రేయ
c) రాజశ్రీ  
d) శ్రీకాంత శర్మ

‘కూలీ నంబర్‌ 1’లో ఇళయరాజా పాడిన పాట పల్లవి ఏమిటి?
a) దండాలయ్యా ఉండ్రాళ్లయ్య
b) అటెన్షన్‌ ఎవ్రిబడీ
c) కలయా నిజమా
d) కొత్త కొత్తగా ఉన్నది

‘నాయకుడు’ సినిమాలో ‘నా నవ్వే దీపావళి’ పాడిన అలనాటి గాయని?
a) జిక్కి b) బి.వసంత
c) పి.లీల
d) జమునారాణి

‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ చిత్రంలో ‘రాధా.. ఎందుకింత బాధ’ పాడిన గాయకుడు?
a) ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం
b) కమలహాసన్‌
c) మలేసియ వాసుదేవన్‌
d) నాగూర్‌బాబు

‘వసంత కోకిల’ చిత్రంలో సిల్క్‌స్మిత, కమల్‌హాసన్‌ మీద చిత్రీకరించిన పాట పల్లవి?
a) ఈ లోకం అతి పచ్చన
b) ఊరించే వయసిది లాలించే మనసిది
c) కథగా కల్పనగా
d) ఇది ఒక మరో లోకం

ఇళయరాజా ట్యూన్‌ చేసిన కృష్ణశాస్త్రి గీతం?
a) మనసున మల్లెల మాలలూగెనె
b) జగదానంద కారక
c) మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
d) జయజయ ప్రియభారత జనయిత్రి

ఇళయరాజా కుమార్తె పేరు?
a) కోకిల
b) పల్లవి
c) సుబ్బులక్ష్మి
d) భవతారిణి

‘ఈ ఎడారి నిండా ఉదక మండలాలు’... వేటూరి చేసిన ఈ పద ప్రయోగం ఉన్న ఇళయరాజా పాట ఏ సినిమాలోనిది.
a) అభిలాష (సందెపొద్దుల కాడ)
b) ప్రేమించు పెళ్లాడు (వయ్యారి గోదారమ్మ)
c) ఛాలెంజ్‌ (సాయంకాలం)
d) మరణమృదంగం(గొడవే గొడవమ్మా)

‘ఏవేవో కలలు కన్నాను’... ఎస్‌.జానకి పాడిన ఈ పాట చిరంజీవి నటించిన ఏ సినిమాలోనిది?
a) నాగు
b) జ్వాల
c) పులి
d) రుస్తుం

ఆర్‌.పి. పట్నాయక్‌ ఇళయరాజా సంగీతంలో పాడిన పాట
a) నీకు నువ్వు నాకు నేను
b) చిరుగాలి వీచెనె
c) ప్రతి దినం నీ దర్శనం
d) వెన్నెల్లో హాయ్‌ హాయ్‌

ఎన్‌.టి.రామారావుకు ఇళయరాజా సంగీతం అందించిన సినిమా
a) యుగంధర్‌
b) యుగపురుషుడు
c) ఛాలెంజ్‌ రాముడు
d) అగ్గిరవ్వ

ఇళయరాజా ట్యూన్‌ చేసిన శ్రీశ్రీ గీతం
a) కూలి కోసం కూటి కోసం (ఆకలి రాజ్యం)
b) నేను సైతం ప్రపంచాగ్నికి (రుద్రవీణ)
c) కొంతమంది కుర్రవాళ్లు (విప్లవశంఖం)
d) నేడే ఈనాడే (ఈనాడు)

ఇళయరాజా సంగీతంలో బాలూ, ఏసుదాస్‌ కలిసి పాడిన పాట
a) కురిసేను విరుజల్లులే (ఘర్షణ)
b) సింగారాల పైరుల్లోన (దళపతి)
c) నాగమణి నాగమణి (రోజా)
d) స్వరరాగ గంగా ప్రవాహమే (సరిగమలు)

ఒకప్పుడు ఇళయరాజాకు గురువుగా ఉండి ఆ తర్వాత ఇళయరాజా దగ్గరే పని చేసిన సంగీత దర్శకుడు?
a) జి.కె.వెంకటేశ్‌
b) ఎల్‌.వైద్యనాథన్‌
c) ఎం.ఎస్‌.విశ్వనాథన్‌
d) కె.వి.మహదేవన్‌

ఇళయరాజా సంగీతంలో ఆశా భోంస్లే పాడిన పాట?
a) తెల్ల చీరకు (ఆఖరి పోరాటం)
b) సెప్టెంబర్‌ మాసం (సఖి)
c) ఓ ప్రేమా (అశ్వమేధం)
d) నాలో ఊహలకు (చందమామ)

‘రావేల వసంతాలే’... చిత్రకు అవార్డు తెచ్చిపెట్టిన ఈ పాట ఏ సినిమాలోది?
a) తూర్పు సిందూరం
b) చైతన్య
c) మైఖేల్‌ మదన కామరాజు
d) డాన్స్‌ మాస్టర్‌

సూపర్‌స్టార్‌ కృష్ణకు ఇళయరాజా సంగీతం అందించిన సినిమా?
a) నా పేరే సాహసం
b) జమదగ్ని
c) తేనె మనసులు
d) బండోడు గుండమ్మ

ఇళయరాజా సంగీతంలో బాలూ పాడి స్క్రీన్‌ మీద నటించిన పాట?
a) ఐయామ్‌ సారీ సో సారీ (ప్రేమ)
b) అందమైన ప్రేమరాణి (ప్రేమికుడు)
c) ఇదే పాట ప్రతీ నోట (పుట్టినిల్లు మెట్టినిల్లు)
d) ప్రేమ ఎంత మధురం (అభినందన)

ఇళయరాజా సంగీతంలో అమితాబ్‌ నటించిన తొలి హిందీ చిత్రం
a) హమ్‌
b) చీనీ కమ్‌
c) చెన్నై ఎక్స్‌ప్రెస్‌  
d) సింగమ్‌

ఇళయరాజా పెట్టగా నాగూర్‌బాబుకు తమిళనాట పాపులర్‌ అయిన పేరు
a) మనో
b) బాబు
c) తంబి
d) నంబి

Advertisement
Advertisement