నిద్రపోయే దిక్కుల్లో... ఈస్ట్‌ బెస్ట్‌... నార్త్‌ వరస్ట్‌

If you fall in the east your memory increases - Sakshi

పరిపరిశోధన

ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోవడం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధనలూ నిరూపిస్తున్నాయి. మనం తలపెట్టుకునే దిశను బట్టి దాని ప్రభావం మన నిద్రమీద, తద్వారా శరీరం మీదా పడుతుందని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు. మనం పడుకునే భంగిమ సరిగా లేకపోతే అది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి. అన్నింటికన్నా తూర్పు దిక్కున తల పెట్టుకుని పడుకుంటే చాలా మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిక్కున తల పెట్టుకుని పడుకుంటే ఏ ఫలితం ఉంటుందో చూద్దాం..

తూర్పుదిక్కున తలపెట్టుకుని పడుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట. ప్రత్యుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుందట. సానుకూల ఆలోచనలు వస్తుంటాయట. తూర్పు తర్వాత దక్షిణానికి పెద్ద పీట వేశారు పెద్దలు. దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకునేవారికి ఆయుష్షు వృద్ధి అవుతుందట. పని చేసే శక్తి కూడా పెరుగుతుందట. ఆ తర్వాత పడమటి దిక్కు. అది అంత మంచిది కాదట. పడమటి దిక్కుగా తల పెట్టుకుని పడుకునేవారిలో అనవసర ఆందోళన, మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. ఇక ఉత్తర దిక్కు సంగతి సరేసరి. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే జీవన కాలం తరిగిపోతుందట. రక్తపోటు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయట.

గుండెపోటు, పక్షవాతం, హెమరేజ్, పార్కిన్‌సన్, ఆలై్జమర్స్‌ వంటివి తలెత్తే ప్రమాదం ఉందట. మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి తరంగాలు మన మెదడులో దాగి వున్న శక్తిమంతమైన విద్యుత్‌ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు, దక్షిణ దిక్కులలో తల ఉంచి నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి లోపాలు ఏమైనా ఉన్నా సర్దుకుంటాయి.  రక్తప్రసరణ సరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుందని ఆయుర్వేద, జ్యోతిష పండితుల దగ్గరనుంచి ఆధునిక పరిశోధకుల వరకూ చెబుతున్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top