హృదయమున్న ద్రాక్ష!

Grapefruit reduces the production of hormone - Sakshi

గుడ్‌ఫుడ్‌ 

ద్రాక్షపండు కేవలం రుచి విషయంలోనే కాదు... ఆరోగ్య ప్రయోజనాల విషయంలోనూ తనకు తానే సాటి. ద్రాక్షతో ఒనగూరే లాభాల్లో ఈ కింద పేర్కొన్నవి  కొన్ని మాత్రమే.మనుషుల్లో యాంజియోటెన్సిన్‌ అనే ఒక రకం హార్మోన్‌కు రక్తనాళాలను సన్నబార్చే గుణం ఉంది. ద్రాక్షపండు ఆ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ విధంగా కూడా ద్రాక్ష  గుండెజబ్బులను నివారిస్తుంది. ద్రాక్షలోని కేటెచిన్‌ అనే యాంటీ యాక్సిడెంట్‌ కూడా అనేక విధాల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. 

రక్తనాళాలను తెరచుకొని ఉండేలా చేసే నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ద్రాక్షపండ్లు వెలువరిస్తాయి. తద్వారా అవి రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చూస్తాయి. ఇలా కూడా అవి గుండెజబ్బులను దరిచేరకుండా చేస్తాయి. అంటే ద్రాక్షపండు ఇలా అనేక మార్గాల్లో గుండెకు మేలు చేస్తుందన్నమాట.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top