ఓ.. పరదేశీ! | Gossip | Sakshi
Sakshi News home page

ఓ.. పరదేశీ!

Jul 21 2015 11:05 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఓ.. పరదేశీ! - Sakshi

ఓ.. పరదేశీ!

బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా.... ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఫ్రాంక్ గస్టంబైడ్‌తో నిండా ప్రేమలో పడిందని ఆ

గాసిప్
 
బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా.... ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఫ్రాంక్ గస్టంబైడ్‌తో నిండా ప్రేమలో పడిందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. ‘మా మధ్య ప్రేమ నిజమే’ అని చెప్పేలా  రీచా తన తాజా చిత్రం ‘మసాన్’ ప్రీమియర్‌కు ఫ్రాంక్‌ను ఇండియాకు ఆహ్వానించింది.అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ‘మసాన్’లో రీచా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రమే వీరిద్దరిని దగ్గర చేసిందనేది ఒక కథనం.

 ముంబాయిలో ఈ జంట పక్కపక్కనే కూర్చొని సినిమా చూడనుందట. ప్రీమియర్ కోసం ఇండియాకు వస్తున్న ఫ్రాంక్  కొద్దిరోజులు ఇక్కడే సరదాగా గడపనున్నాడట. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పరిచయమైన వీరు ఆతరువాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని, పెళ్లికి దగ్గరయ్యారని  ప్యారిస్‌లో చాలా చోట్ల ఈ జంట కనిపించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు రీచా. ‘‘అన్నీ గాలివార్తలే’’ అంది ఆమె చిరు విసుగుతో! ఫ్రాంక్ కోసం రీచా ఎదురుచూస్తున్న తీరు, పడుతున్న హడావిడి చూస్తుంటే.... ‘‘గాలి వార్తలు కాదు...నిజమైన వార్తలే’’ అనిపిస్తుంది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement