ఓ.. పరదేశీ!
గాసిప్
బాలీవుడ్ హీరోయిన్ రీచా చద్దా.... ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఫ్రాంక్ గస్టంబైడ్తో నిండా ప్రేమలో పడిందని ఆ మధ్య గుసగుసలు వినిపించాయి. ‘మా మధ్య ప్రేమ నిజమే’ అని చెప్పేలా రీచా తన తాజా చిత్రం ‘మసాన్’ ప్రీమియర్‌కు ఫ్రాంక్ను ఇండియాకు ఆహ్వానించింది.అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ‘మసాన్’లో రీచా నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ చిత్రమే వీరిద్దరిని దగ్గర చేసిందనేది ఒక కథనం.
ముంబాయిలో ఈ జంట పక్కపక్కనే కూర్చొని సినిమా చూడనుందట. ప్రీమియర్ కోసం ఇండియాకు వస్తున్న ఫ్రాంక్ కొద్దిరోజులు ఇక్కడే సరదాగా గడపనున్నాడట. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పరిచయమైన వీరు ఆతరువాత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారని, పెళ్లికి దగ్గరయ్యారని ప్యారిస్‌లో చాలా చోట్ల ఈ జంట కనిపించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు రీచా. ‘‘అన్నీ గాలివార్తలే’’ అంది ఆమె చిరు విసుగుతో! ఫ్రాంక్ కోసం రీచా ఎదురుచూస్తున్న తీరు, పడుతున్న హడావిడి చూస్తుంటే.... ‘‘గాలి వార్తలు కాదు...నిజమైన వార్తలే’’ అనిపిస్తుంది!