కోర్టులో గాంధీ... | gandhi In the court's | Sakshi
Sakshi News home page

కోర్టులో గాంధీ...

Jun 2 2015 11:37 PM | Updated on Sep 3 2017 3:07 AM

కోర్టులో గాంధీ...

కోర్టులో గాంధీ...

స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటిష్‌వారు అసంఖ్యాకంగా కేసులు పెట్టేవారు. వారికి చాలాసార్లు జైలుశిక్షలు పడేవి.

స్వాతంత్య్ర సమరయోధులపై బ్రిటిష్‌వారు అసంఖ్యాకంగా కేసులు పెట్టేవారు. వారికి చాలాసార్లు జైలుశిక్షలు పడేవి. అయితే కొన్నిసార్లు న్యాయమూర్తులు శిక్షలు వేయకుండా ‘వదిలేస్తే బుద్ధిగా మసులుకుంటామనే’ హామీని తీసుకొని విడుదల చేసేసేవారు. ఒకసారి బొంబాయి హైకోర్టులో గాంధీ మీద ఇలాంటి కేసే వచ్చింది.  ‘శిక్ష వేయను.

బయటకు వెళ్లాక బుద్ధిగా నడుచుకుంటారా’ అని న్యాయమూర్తి అడిగారు. అందుకు గాంధీజీ జవాబు- ‘బయటకు వెళ్లాక నేను బుద్ధిగా నడుచుకోను. బ్రిటిష్‌వారిని తిడతాను. మళ్లీ జైల్లో పెట్టండి. మళ్లీ బయటకు వచ్చి తిడతాను. ఈ దేశం నుంచి బ్రిటిష్‌వారు వెళ్లిపోయేవరకు వారిని తిడుతూనే ఉంటాను’. అదీ గాంధీ సత్యమార్గం.
 

Advertisement
 
Advertisement
Advertisement